vishal: సినిమాల ఆన్‌లైన్ పైరసీపై హీరో విశాల్ ఆగ్ర‌హం

vishan fires on piracy

  • బిగ్‌స్క్రీన్‌లోకి రాకముందే పలు సినిమాలు ఆన్‌లైన్‌లో పైరసీ
  • దీనికి ప్రభుత్వ సైబర్ సెల్‌ను నిందించాలి 
  • చాలా కాలం నుంచి పైరసీపై పోరాటం చేస్తున్నా
  • యాంటీ పైరసీ బృందాన్ని కూడా ఏర్పాటు చేశా

సినిమాలు ఇలా విడుద‌ల కాగానే.. అలా ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు కేటుగాళ్లు. ప‌లు సంద‌ర్భాల్లో ఇంకా అడ్వాన్స్‌డ్‌గా వ్య‌వ‌హ‌రించి థియేట‌ర్ల‌లోకి రాక‌ముందే ఆన్‌లైన్‌లో సినిమాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. సాంకేతిక‌త ఎంత‌గా పెరిగినా ఇంటర్నెట్‌లో సినిమాల పైర‌సీకి అడ్డుక‌ట్ట‌ప‌డ‌ట్లేదు.

దీనిపై హీరో విశాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... బిగ్‌స్క్రీన్‌ల్లోకి రాకముందే పలు సినిమాలను ఆన్‌లైన్‌లో పైరసీ చేస్తున్నారని అన్నాడు. ఈ సమస్యకు ఎవరిని నిందించాలో మీకు తెలుసా? అని ఆయ‌న ప్ర‌శ్నించాడు. ఇందుకు సినిమా సంస్థలు, ప్రభుత్వ సైబర్ సెల్‌ను నిందించాల‌ని చెప్పాడు. తాను చాలా కాలం నుంచి పైరసీపై పోరాటం చేస్తున్నానని, దాన్ని రూపుమాపడానికి ఇప్పటికే కొంతమంది యువకులతో యాంటీ పైరసీ బృందాన్ని ఏర్పాటు చేశాన‌ని తెలిపాడు.  

కాగా, త‌న బాలీవుడ్‌ ఎంట్రీ గురించి తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని విశాల్ అన్నాడు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ విష‌యాన్ని తాను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని అన్నాడు. ఏ సినిమాకైనా కథే హీరోన‌ని ఆయ‌న చెప్పాడు. స్టోరీ బాగుంటే ఏ భాష సినిమానైనా ప్రేక్ష‌కులు ఆదరిస్తారని తెలిపాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్‌ కారణంగా కాస్త విరామం దొరకడంతో అన్ని భాషల‌ సినిమాలను చాలామంది చూశార‌ని ఆయ‌న చెప్పాడు. రీమేక్‌లు పెరిగిపోయాయ‌ని చెప్పాడు.  

  • Loading...

More Telugu News