K Kavitha: కల్వకుంట్ల కవిత భర్తకు కరోనా పాజిటివ్

TRS MLC Kavitha husband tested with corona positive
  • కవిత భర్త అనిల్ కు పాజిటివ్
  • హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపిన కవిత
  • తనతో పాటు కుటుంబ సభ్యులందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నామని వ్యాఖ్య
టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కవిత ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. 'నా భర్త అనిల్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుంది. నా భర్తకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో నేను, నా కుటుంబ సభ్యులందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నాం. పరిస్థితి మెరుగయ్యేంత వరకు ఇంటి నుంచి బయటకు రాలేము. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నా ఆఫీసును కూడా మూసేశాం' అని ఆమె తెలిపారు.  
K Kavitha
TRS
Husband
Corona Virus

More Telugu News