yoga: ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌ల‌కిందులుగా న‌డుస్తూ కారును లాగిన వ్య‌క్తి.. వీడియో ఇదిగో

A yoga instructor walked upside down

  • త‌మిళ‌నాడులో ఘ‌ట‌న
  • ఆర్ఎస్ పురంలో ఎన్నిక‌ల ప్ర‌చారం
  • మంత్రి వేలుమ‌ణికి మ‌ద్ద‌తుగా కారును లాగిన‌ యోగా టీచ‌ర్  

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అభ్య‌ర్థులు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా కొంద‌రు ఓట‌ర్ల ఇంటికి వెళ్లి బ‌ట్ట‌లు ఉతుకుతుంటే, మ‌రికొందరు చిన్న‌పిల్ల‌ల‌కు స్నానం చేయిస్తున్నారు. త‌మ నేతల త‌ర‌ఫున కార్య‌క‌ర్త‌లు కూడా జ‌నాల‌ను ఆక‌ర్షించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఆర్ఎస్ పురంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అన్నాడీఎంకే అభ్య‌ర్థి, రాష్ట్ర మంత్రి ఎస్‌పీ వేలుమ‌ణికి మ‌ద్ద‌తుగా ఓ యోగా టీచ‌ర్ కారులాగాడు. మామూలుగా కాదు.. త‌ల‌కిందులుగా న‌డుస్తూ న‌డుము, కారుకి మ‌ధ్య చైను కట్టుకుని ఆ వాహ‌నాన్ని లాగాడు. దీని వ‌ల్ల త‌న అభిమాన నేతకు ప్ర‌చారంతో పాటు యోగా‌పై కూడా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించవ‌చ్చ‌ని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.  

yoga
Tamilnadu
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News