Jagan: విశాఖకు పోలవరం జలాల తరలింపు పనులు వేగంగా జరగాలి: సీఎం జగన్

CM Jagan discusses priority works for Vizag

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష
  • విశాఖ ప్రాధాన్యతా ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చర్చ
  • భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై దృష్టి
  • బీచ్ రోడ్ల అంశంపైనా చర్చ
  • రాష్ట్రంలో పరిశుభ్రతపైనా సమీక్ష

విశాఖకు సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖకు పోలవరం జలాల తరలింపు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్ పోర్టు, బీచ్ కారిడార్ పనులు వేగంగా చేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో మెట్రో ప్రాజెక్టుపైనా అధికారులు దృష్టి పెట్టాలని నిర్దేశించారు. ఈ సమీక్షలో భాగంగా విశాఖ-భీమిలి బీచ్ రోడ్డు, భీమిలి-భోగాపురం బీచ్ రోడ్డు అంశంపైనా సీఎం జగన్ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఇతర అంశాలపైనా ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. రాష్ట్రంలో పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం షురూ చేయాలన్నారు. కాగా, చెత్త సేకరించేందుకు 8 వేల ఆటోమేటిక్ ట్రక్కులను కొనుగోలు చేస్తామని, వాటిని వార్డుకు 2 చొప్పున అందజేస్తామని చెప్పారు. ఈ ట్రక్కులకు జీపీఎస్ తో అనుసంధానం చేస్తామని, కెమెరాలను కూడా అమర్చుతామని వివరించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News