Ayyanna Patrudu: జగన్ రెడ్డికి పారదర్శకత, రివర్స్ టెండరింగ్ లాంటి పదాలు సెట్ కావు సాయిరెడ్డీ!: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu slams CM Jagan and Vijayasai Reddy

  • లిక్కర్ డాన్, ఇసుకదొంగ అంటూ జగన్ పై విమర్శలు
  • ఇసుక అందివ్వలేని దద్దమ్మలు అంటూ వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో జగన్ బ్రాండ్లు అమ్ముతున్నారని ఆరోపణ
  • మహిళల మెడలో పుస్తెలు కొట్టేస్తున్నారని ఆగ్రహం

ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. లిక్కర్ డాన్, ఇసుక దొంగ అంటూ సీఎం జగన్ ను విమర్శించారు. జగన్ రెడ్డికి పారదర్శకత, రివర్స్ టెండరింగ్ వంటి పదాలు సెట్ కావు సాయిరెడ్డీ అంటూ ట్వీట్ చేశారు.

"రెండేళ్లలో సామాన్యుడికి ఇసుక అందివ్వలేని దద్దమ్మలు మీరు, మద్యపాన నిషేధం పేరుతో జగన్ బ్రాండ్లు అమ్ముతూ మహిళల మెడలో పుస్తెలు కొట్టేస్తున్న కేటుగాళ్లు మీరు" అంటూ మండిపడ్డారు.

"మీది రివర్స్ టెండరింగ్ కాదు, రివర్స్ దోపిడీ. నీ టెండర్లు, దాని వెనుక ఉన్న దొంగ లెక్కలు బయటపెట్టి, మీరు మింగిన ప్రతి రూపాయి వడ్డీతో సహా కక్కిస్తాం... రాసిపెట్టుకో విజయసాయిరెడ్డీ!" అంటూ నిప్పులు చెరిగారు.

Ayyanna Patrudu
Jagan
Vijay Sai Reddy
Andhra Pradesh
  • Loading...

More Telugu News