TVV: తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడి అరెస్ట్

TVV Chief Ravindar arrested

  • అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • మంచిర్యాల జిల్లాలో ఆయన నివాసంలో అదుపులోకి
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో సోదాలు

అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి మాజీ నేత గురిజాల రవీందర్‌రావు (63)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ క్యాతనపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో నివసిస్తున్న ఆయన ఇంటికి నిన్న ఉదయం ఏడు గంటలకు పోలీసులు చేరుకున్నారు. ఇంటిని అధీనంలోకి తీసుకొని సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగించారు. అనంతరం 5 గంటలకు రవీందర్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

రవీందర్‌రావు 1978లో రాడికల్ యూత్ లీగ్‌లో, 1981లో సింగరేణి కార్మిక సంఘంలో కీలక పదవుల్లో పనిచేశారని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 1985లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, ఆ తర్వాత కొన్ని రోజులకే లొంగిపోయి బెయిలుపై విడుదలయ్యారని పేర్కొన్నారు.  ఆయనపై 120, 120బీతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

మరోవైపు, రవీందర్‌రావు అరెస్ట్‌ను పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఖండించారు. ప్రశ్నించే గొంతులను పోలీసులు అణచివేస్తున్నారని, రవీందర్‌రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TVV
Gurijala Ravindar
Mancherial District
Telangana
  • Loading...

More Telugu News