Grandhi Srinivas: టీడీపీ ఎమ్మెల్యే బౌలింగ్... వైసీపీ ఎమ్మెల్యే బ్యాటింగ్... వీడియో ఇదిగో!

Grandhi Srinivas and Mantena Ramaraju plays cricket

  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్రికెట్ టోర్నీ
  • ప్రారంభోత్సవానికి హాజరైన గ్రంథి శ్రీనివాస్, మంతెన రామరాజు
  • జ్యోతి వెలిగించి టోర్నీ ప్రారంభించిన ఎమ్మెల్యేలు
  • ఆకట్టుకునేలా క్రికెట్ నైపుణ్యం ప్రదర్శించిన వైనం

2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టుగా తయారైంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆ ధోరణి మరింత తీవ్రమైంది. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరై సుహృద్భావ వాతావరణంలో సరదాగా కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్సార్ కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుండగా... భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ (వైసీపీ), ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు (టీడీపీ) టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇరువురు లాంఛనగా జ్యోతి ప్రజ్వలనం చేయడమే కాకుండా, మైదానంలో దిగి తమ క్రికెట్ నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ బ్యాటింగ్ చేయగా, టీడీపీ శాసనసభ్యుడు మంతెన రామరాజు బౌలింగ్ చేశారు. వీరిద్దరూ ఆడుతుంటే ఇతర నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News