AIIMS: అందుకే దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది... ఎయిమ్స్‌ చీఫ్‌ చెప్పిన కారణాలు

Guleria listed reasons behind corona second wave
  • దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు
  • ప్రజల నిర్లక్ష్యం, కొత్త రకాలు పుట్టుకురావడం ఓ కారణం
  • టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌ తగ్గడం మరో కారణం
  • అప్రమత్తంగా లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్న ఎయిమ్స్‌ చీఫ్‌
ప్రజలు అప్రమత్తంగా ఉండడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం తప్ప కరోనా రెండో వేవ్‌ను కట్టడి చేయడానికి మరో మార్గమే లేదని ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

కరోనాలో కొత్త రకాలు పుట్టుకురావడం, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే మరోసారి కరోనా విజృంభించడానికి కారణాలని గులేరియా తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ప్రజలు కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారని..  మాస్కులు ధరించడం లేదని తెలిపారు. మాస్కులు ధరించకుండానే భారీ స్థాయిలో గుమికూడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయని తెలిపారు.

కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, కరోనా సోకిన వారితో కలిసిన వారిని గుర్తించి ఐసోలేట్ చేయడం కూడా తగ్గిందని గులేరియా తెలిపారు. ఇది కూడా కరోనా విజృంభణకు మరో కారణమని స్పష్టం చేశారు.
AIIMS
Coronavirus
vaccine
second wave

More Telugu News