Kangana Ranaut: ముంబయి పట్ల నా విధేయతను ప్రశ్నించినప్పుడు మౌనంగా రోదించాను: కంగనా రనౌత్

Kangan Ranaut latest comments on Maha govt

  • కొంతకాలంగా కంగనా, మహా సర్కారు మధ్య పోరు
  • గతంలో అవినీతిని ప్రశ్నించానన్న కంగనా
  • దాంతో బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారని వెల్లడి
  • కోర్టు సాయంతో ఆస్తులు కాపాడుకున్నానని వివరణ

మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి ధ్వజమెత్తారు. గతంలో ఈ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినప్పుడు, దాడులు, బెదిరింపులతో తనను తీవ్రమైన క్షోభకు గురిచేశారని వెల్లడించారు. సర్కారు అన్యాయంగా తన నివాసాన్ని కూల్చివేసినప్పుడు అనేకమంది రాజకీయనేతలు సంబరాలు చేసుకున్నారని, అయితే కోర్టుల సాయంతో తన ఆస్తులు కాపాడుకోగలిగానని కంగనా పేర్కొన్నారు. ముంబై నగరం పట్ల తన విధేయతను ప్రశ్నించినప్పుడు మాత్రం ఎంతో వేదనకు గురయ్యానని, మౌనంగా రోదించానని తెలిపారు. తాను అవినీతిపరురాలిని కాదన్నారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ముంబయి మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కంగనా స్పందిస్తూ... ఇప్పుడు ఎవరు అవినీతిపరులో, ఎవరు దేశభక్తులో వెల్లడైందని అన్నారు. మున్ముందు వీరి అవినీతి లీలలు మరిన్ని బయటికి వస్తాయని పేర్కొన్నారు.

Kangana Ranaut
Maharashtra Government
Mumbai
Corruption
  • Loading...

More Telugu News