Kamal Haasan: అభిమానులు మీద పడటంతో కమలహాసన్ కాలికి గాయం.. ప్రచారానికి దూరం!

Kamal Haasan injured during election campaign
  • దక్షిణ కోయంబత్తూరులో ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన
  • కమల్ వద్దకు తోసుకొచ్చిన అభిమానులు
  • కాలిని తొక్కేయడంతో గాయపడ్డ కమల్
సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ గాయపడ్డారు. దక్షిణ కోయంబత్తూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... అతని అభిమానులు ఒక్కసారిగా తోసుకొచ్చారు. తొక్కిసలాటలో వారు కమల్ మీద పడ్డారు. ఆయన కాలిని తొక్కేశారు. ఈ ఘటనలో కమల్ కాలికి గాయమైంది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు ప్రచారాన్ని ఆయన ఆపేశారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కమల్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. దక్షిణ కోయంబత్తూరు స్థానం నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. గత సోమవారం ఆయన నామినేషన్ వేశారు. కమల్ పార్టీ తరపున సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.
Kamal Haasan
Injury
Tollywood
Kollywood

More Telugu News