Somu Veerraju: అప్పట్లో చందా బాబు... ఇప్పుడు యేసు బాబు: కేంద్ర పథకాలపై స్టిక్కర్లు అంటూ సోము వీర్రాజు విమర్శలు

Somu Veerraju criticises YSRCP Govt for stickers on Central schemes

  • కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్నారని ఆరోపణ
  • గత ప్రభుత్వంపైనా విమర్శలు!
  • ఇప్పుడు జగన్ సర్కారు సొంత స్టిక్కర్లు వేసుకుంటోందని ఆరోపణ
  • పథకాల జాబితా పంచుకున్న సోము వీర్రాజు

కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందంటూ బీజేపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా సోము వీర్రాజు ట్విట్టర్ లో స్పందించారు. అప్పట్లో చందాబాబు, ఇప్పుడు యేసు బాబు అంటూ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలపై జగన్ ప్రభుత్వం సొంత స్టిక్కర్లు వేసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ఓ జాబితాను కూడా సోము వీర్రాజు తన ట్వీట్ లో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర పథకానికి  ఏ పేరు పెట్టి అమలు చేస్తోందో వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి పీఎం ఆవాస్ యోజన వరకు కేంద్ర పథకాలను రాష్ట్రం ఎలా తనవిగా చెప్పుకుంటోందో తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News