Vijay Sai Reddy: అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు: విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

vijaya sai slams tdp leaders

  • జనం సామాన్యులకు పట్టం కట్టారు
  • తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని టీడీపీ నేత‌ల‌ ఆందోళ‌న‌
  • మీడియాలో వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరు
  • ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు

టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, అయ్య‌న్న పాత్రుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లోనూ వైసీపీ స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'జనం సామాన్యులకు పట్టం కట్టడంతో తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు. నామ్ కే వాస్తే అధ్యక్ష పదవిని కూడా బాబు ఎక్కడ పీకుతాడోనని వణుకు. మీడియాలో వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు' అంటూ టీడీపీ నేత‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News