Corona Virus: తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా వ్యాప్తి.. కొత్తగా 364 కేసులు

 Media Bulletin on status of positive cases COVID19 in Telangana

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724
  • మొత్తం మృతుల సంఖ్య 1,666
  • ప్రస్తుతం 2,607 మందికి చికిత్స
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 75 మందికి క‌రోనా

తెలంగాణలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్త‌గా 364 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,451 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,666గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,607 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 980 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 75 మందికి క‌రోనా సోకింది.

   

  • Loading...

More Telugu News