Budda Venkanna: మొట్టికాయలు జగన్ కు కొత్త కాదయా: బుద్ధా వెంకన్న

Budda Venkanna slams Jagan after AP HC verdict

  • చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టినప్పుడే.. అది దొంగ కేసు అని తేలిపోయింది
  • ఇకపై సన్నబియ్యం డోర్ డెలివరీపై దృష్టి పెట్టండి
  • మీ నాన్నకే సాధ్యంకాని పనుల గురించి ఎక్కువగా ఆలోచించకండి

అమరావతి అసైన్డ్ భూముల సీఐడీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కలిగించింది. సీఐడీ విచారణపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్, వైసీపీపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మొట్టికాయలు జగన్ కు కొత్త కాదయా' అని ఆయన వ్యాఖ్యానించారు. రెడ్డి గారి ఫిర్యాదుతో చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన రోజే... అది దొంగ కేసు అని తేలిపోయిందని అన్నారు. ఇకనుంచి అమరావతిపై విషం కక్కడం, చంద్రబాబుపై కక్షసాధింపులు పక్కనపెట్టి... సన్నబియ్యం డోర్ డెలివరీపై దృష్టి పెడితే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినందుకు కనీస అర్థం ఉంటుందని హితవు పలికారు. మీ నాన్నగారికే సాధ్యం కాని పని గురించి ఎక్కువగా ఆలోచించి తల బొప్పి కట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నానని ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News