Sajjala Ramakrishna Reddy: సెలవుపై వెళ్లాలని నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరికాదు: సజ్జల ఫైర్

Sajjala fires on SEC Nimmagadda

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 6 రోజుల్లో పూర్తవుతాయి
  • కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలి
  • నిమ్మగడ్డ సెలవును వాయిదా వేసుకోవాలి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేవలం 6 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని చెప్పారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ఆయన సెలవులను వాయిదా వేసుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలను జరపాలని అన్నారు.

రిజర్వేషన్ల విషయంలో జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని సజ్జల చెప్పారు. 78 శాతం మంది బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారిని మేయర్, ఛైర్మన్ స్థానాల్లో నియమించారని తెలిపారు. చట్టంలో లేకపోయినా వీరికి అదనంగా రిజర్వేషన్లను కల్పించామని చెప్పారు. బీసీలకు 46.51 శాతం, మైనార్టీలకు 13.95 శాతం పదవులు ఇచ్చామని తెలిపారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగానే పదవుల కేటాయింపులు జరిగాయని చెప్పారు.

  • Loading...

More Telugu News