NIA: అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం నిలిపింది సచిన్ వాజే... ఎన్ఐఏ వెల్లడి

NIA names Mumbai cop Sanchin Waje in Ambani case
  • ఇటీవల అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం
  • ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఎన్ఐఏ
  • పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్
  • సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు
  • వాజే విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం
రిలయన్స్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనాన్ని నిలిపిందెవరో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. పోలీసు అధికారి సచిన్ వాజే ఈ వాహనాన్ని అంబానీ ఇంటికి సమీపంలో నిలిపాడని తెలిపింది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ పెద్ద కర్చీఫ్ తో తన ముఖాన్ని కప్పుకున్నాడని, కుర్తా, పైజామా వేసుకున్నాడని ఎన్ఐఏ పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ లో వాజే ధరించింది పీపీఈ కిట్ లా కనిపించిందని, కానీ ఆయన భారీ సైజు దుస్తులు ధరించాడని వివరించింది.

ఇక ఈ కేసులో వాజేను అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన నివాసం నుంచి ఓ లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నామని, కానీ అందులో సమాచారాన్ని తొలగించినట్టు గుర్తించామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. మొబైల్ ఫోన్ ను గురించి ప్రశ్నిస్తే అది ఎక్కడో పడిపోయిందని వాజే చెప్పాడని వివరించారు. పోలీసు అధికారి సచిన్ వాజేను విచారిస్తే అసలు విషయం వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
NIA
Sachin Waje
Mukesh Ambani
Scorpio Vehicle
Explosives
Mumbai

More Telugu News