Indian Railways: మరికొన్ని రైళ్లను పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే
- ఏప్రిల్ 1 నుంచి ప్రతిరోజూ సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రైలు
- ఏప్రిల్ 6 నుంచి తిరుపతి-జమ్ముతావి మధ్య రైలు అందుబాటులోకి
- విశాఖ-లింగంపల్లి ప్రత్యేక రైలు జూన్ 30 వరకు పొడిగింపు
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లతోపాటు తిరుపతి-జమ్ముతావి-తిరుపతి రైళ్లను దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రైలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రతీ రోజు నడవనుండగా, రెండో తేదీ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తిరుపతి-జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి ప్రతి మంగళవారం అందుబాటులోకి రానుండగా, అదే రైలు తిరుగు ప్రయాణంలో 9వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
ఇక, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్టణం-లింగంపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును జూన్ 30 వరకు, లింగంపల్లి-విశాఖపట్టణం మధ్య నడిచే రైలును జులై 1 వరకు పొడిగిస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది.