Chandrababu: ధైర్యంగా ఉండు గోపాల్.... నీకేం కాదు: ఆసుపత్రి బెడ్ పై ఉన్న మాజీ మంత్రి బొజ్జలతో చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu consoles ailing former minister Bojjala Gopalakrishna Reddy

  • కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల 
  • హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • నేడు బొజ్జలను పరామర్శించిన చంద్రబాబు
  • తప్పకుండా కోలుకుంటావంటూ ధైర్యం నింపిన వైనం

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు ఆయనను పరామర్శించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.... బెడ్ పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి యోగక్షేమాలు కనుక్కున్నారు.

"గోపాల్ నీకేం కాదు... ధైర్యంగా ఉండు. నువ్వు తప్పకుండా కోలుకుని ఇంటికి వస్తావు. ఈసారి మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను. బై గోపాల్" అంటూ చంద్రబాబు స్వాంతన వచనాలు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏఐజీ డాక్టర్లను అడిగి బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎంతో ఉల్లాసంగా మాట్లాడిన చంద్రబాబు... బొజ్జలను సంతోషంలో ముంచెత్తారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News