Tara Sutaria: కరోనా బారిన పడ్డ బాలీవుడ్ హీరోయిన్, నటుడు

Tara Suraria tests positive with corona
  • తారా సుతారియా, సిద్ధాంత్ చతుర్వేదిలకు కరోనా
  • హోం క్వారంటైన్ లో ఉన్న నటీనటులు
  • ఇటీవలే కరోనా బారిన పడ్డ రణబీర్ కపూర్
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కరోనా బారిన పడుతున్న బాలీవుడ్ ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో గడుపుతున్నాడు. తాజాగా మరో ఇద్దరికి కరోనా సోకిందనే వార్తలతో బాలీవుడ్ షాక్ కు గురైంది.

యంగ్ హీరోయిన్ తార సుతారియా, మరో నటుడు సిద్ధాంత్ చతుర్వేదిలు కరోనా బారిన పడ్డారు. 'తపడ్' చిత్ర ప్రమోషన్లో తార పాల్గొనాల్సి ఉండగా... కత్రినా కైఫ్, ఇషాన్ కట్టర్ లతో కలిసి 'ఫోన్ బూత్' షూటింగ్ లో సిద్ధాంత్ పాల్గొనాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వారిద్దరూ తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హోం క్వారంటైన్ లో గడుపుతున్నారు.
Tara Sutaria
Sidhant Chaturvedi
Bollywood
Corona Virus

More Telugu News