Telangana: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- బడ్జెట్ ను ఆమోదించేందుకు సమావేశం కానున్న ఉభయసభలు
- నేడు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం
- తొలిరోజు కేవలం గవర్నర్ ప్రసంగంతో సరి
- మరుసటి రోజు నుంచి సమావేశాలు
- అజెండా నిర్ణయించనున్న బీఏసీ కమిటీలు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2021-22 వార్షిక బడ్జెట్ ను ఆమోదించేందుకు శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. నేటి నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు 12 రోజుల పాటు కొనసాగుతాయని తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు షురూ అవుతాయి.
కాగా తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం మరుసటిరోజుకు వాయిదాపడనున్నాయి! ఇక సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ, మండలి బీఏసీ కమిటీలు బడ్జెట్ సమావేశాల తీరుతెన్నులపై చర్చించి అజెండాను నిర్ణయించనున్నాయి. ఈ నెల 16న దివంగత సభ్యులకు సంతాపం తీర్మానం, ఈ నెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు తీర్మానంపై చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్ ను ఈ నెల 18న ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని ప్రోటోకాల్ చర్యలను తప్పనిసరి చేశారు.