Man: కమలహాసన్ కారు డోర్ తీసేందుకు యత్నించిన వ్యక్తి... చితకబాదిన ఎంఎన్ఎం కార్యకర్తలు

Man tries to open door as MNM workers beaten him
  • గతరాత్రి కాంచీపురం జిల్లాలో కమల్ ఎన్నికల ప్రచారం
  • చెన్నైకి తిరిగి వెళుతుండగా ఘటన
  • జనసమూహంలో నిదానంగా వెళుతున్న కారు
  • కారు డోర్ తీస్తున్న మందుబాబును గుర్తించిన ఎంఎన్ఎం కార్యకర్తలు
  • గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ గత రాత్రి కాంచీపురం జిల్లాలో ప్రయాణిస్తుంగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జనసమూహంలో కమల్ కారు నిదానంగా వెళుతుండగా ఓ వ్యక్తి కారు డోర్ తీసేందుకు యత్నించాడు. ఇది గమనించిన ఎంఎన్ఎం కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. కాంచీపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమలహాసన్ చెన్నైకి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి కమల్ పై దాడి చేసేందుకు యత్నిస్తున్నాడని భావించిన ఎంఎన్ఎం కార్యకర్తలు అతడ్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. గాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసుల విచారణలో అతను కమల్ అభిమాని అని తేలింది. ఎంఎన్ఎం వర్గాలు మాత్రం ఇది కమల్ పై దాడికి యత్నమేనంటున్నాయి. ఈ దాడి వెనకున్న ఉద్దేశమేంటో పార్టీ విచారణలో తేలుతుందని చెబుతున్నాయి.
Man
Kamal Haasan
Car Door
Kancheepuram
MNM
Tamilnadu

More Telugu News