Corona Virus: కరోనా వైరస్ కొద్దిమార్పులతో గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి... తాజా అధ్యయనంలో వెల్లడి

Corona spreads from bats to humans

  • కరోనా వైరస్ వ్యాప్తిపై ఓ అధ్యయనం
  • ప్లాస్ బయాలజీలో అధ్యయనం ప్రచురణ
  • వేల కరోనా జీనోమ్ లపై పరిశోధన
  • ఇతర వైరస్ ల కంటే కరోనా భిన్నమైందని వెల్లడి

ప్రమాదకర కరోనా వైరస్ ఎక్కడ్నించి ఉత్పన్నమైంది? మనుషులకు ఎలా వ్యాప్తి చెందింది? అనే అంశాలపై తాజాగా ఓ అధ్యయనం వెలువడింది. గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా సోకిందని, అయితే గబ్బిలాల్లో ఉన్నప్పటి కరోనా వైరస్ కు, మనుషులకు సోకిన తర్వాత కరోనా వైరస్ కు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందిన తర్వాత కరోనా వైరస్ కొద్దిగా మార్పులకు లోనైనట్టు తెలిపారు. ప్లోస్ బయాలజీ అనే సైన్స్ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

కరోనా వ్యాప్తి మొదలైన తొలి 11 నెలల్లో సేకరించిన వందల వేల కరోనా జీనోమ్ లపై పరిశోధన చేసి ఈ అంశాలను గుర్తించినట్టు పరిశోధకుల్లో ఒకరైన ఆస్కార్ మెక్లీన్ వెల్లడించారు. అయితే, వైరస్ లు కొత్త అతిథేయి దేహంలో ప్రవేశించినప్పుడు మార్పులు సంతరించుకోవడానికి కొంత సమయం తీసుకుంటాయని, కానీ కరోనా మాత్రం భిన్నమైందని సెర్గీ పాండ్ అనే మరో పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. కరోనా విషయంలో ఇతరులకు వ్యాప్తి చెందే సామర్థ్యం రెడీమేడ్ గానే, అప్పటికప్పుడు ఎంతో వేగంగా ఉత్పన్నమై ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News