Vijay Sai Reddy: ఒకరిని ఒకరు ఓదార్చుకునేందుకు పక్క రాష్ట్రంలో ఒకే ఇంట్లో ఉన్నారట!: విజ‌య‌సాయిరెడ్డి

vijaya sai slams chandrababu

  • 2019 ఎన్నికల్లో ఓడాక ఈవీఎంలు వద్దు బ్యాలెట్‌లు కావాలన్నాడు
  • ఈ ఎన్నికల్లో ఓడాక బ్యాలెట్లు వద్దంటాడేమో
  • ఎన్నికల ఫలితాల రోజు కూడా నువ్వు, నీ కొడుకు హైద‌రాబాద్‌లో ఉన్నారు
  • చంద్ర‌బాబుకి విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న‌కు ప్ర‌జాస్వామ్యం మీద ఉన్న‌ విశ్వాసం ఏపాటిదో అర్థం అవుతోంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు చేశారు.

'2019 ఎన్నికల్లో ఓడాక ఈవీఎంలు వద్దు బ్యాలెట్‌లు కావాలని అన్నాడు. ఈ ఎన్నికల్లో ఓడాక బ్యాలెట్ వద్దు ఈవీఎంలు కావాలంటాడేమో. పప్పూ అండ్ తుప్పూ... ఒకరిని ఒకరు ఓదార్చుకునేందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉన్నారట!' అని విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లంటించారు.

'ఎన్నికల ఫలితాల రోజు కూడా నువ్వు, నీ కొడుకు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ ఇంట్లోంచి కదలలేదంటే... ప్రజాస్వామ్యం మీద నీ ఆత్మవిశ్వాసం చాలా గొప్పది చంద్రబాబూ!' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


Vijay Sai Reddy
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News