Puducherry: పుదుచ్చేరిలో 12 నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన స్టాలిన్

DMK Announces 12 Candidates For Puducherry Polls
  • పుదుచ్చేరిలో 13 స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే
  • బాగూర్ అభ్యర్థిని పెండింగ్ లో పెట్టిన స్టాలిన్
  • పుదుచ్చేరిలో మొత్తం స్థానాలు 30
తమిళనాడుతో పాటు, పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని డీఎంకే అధినేత స్టాలిన్ పట్టుదలగా ఉన్నారు. తమిళనాడులో డీఎంకేదే అధికారమని ఒపీనియన్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరోవైపు పుదుచ్చేరిలో తాము పోటీ చేస్తున్న 13 స్థానాలకు గాను 12 స్థానాలకు ఈరోజు స్టాలిన్ అభ్యర్థులను ప్రకటించారు. బాగూర్ నియోజకవర్గ అభ్యర్థిని మాత్రం ఆయన పెండింగ్ లో పెట్టారు. ఉరూలియన్ పేట్, ఉప్పాలం, మంగళం, ముదళియార్ పేట్, విల్లియనూర్, నెల్లితూపు, మన్నాడిపట్టు, కల్లాపట్టు, తిరుపువనాయ్, కరైకల్, రాజ్ భవన్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇతర స్థానాలను డీఎంకే తన మిత్ర పక్షాలకు కేటాయించింది. పుదుచ్చేరి కేంద్ర పాలితప్రాంతంలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి.
Puducherry
Elections
DMK
Stalin

More Telugu News