Kamal Haasan: ఓడిపోయినా బాధపడను.. ప్రజల మధ్యే ఉంటా: కమలహాసన్

We are not B team to any party says Kamal Haasan
  • మేము ఏ పార్టీకి బీ-టీమ్ కాదు
  • నా వల్ల డీఎంకే నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు
  • ఎన్నికల్లో మా ప్రత్యర్థి డీఎంకేనే
బీజేపీకి తాను బీ-టీమ్ అని, మోదీ, అమిత్ షాల సలహాలను తీనుకుంటున్నానని డీఎంకే నేతలు ఆరోపించడంపై సినీ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమలహాసన్ మండిపడ్డారు. తాను ఏ పార్టీకి బీ-టీమ్ ను కాదని ఆయన అన్నారు. తన వల్ల డీఎంకే నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వారు చేస్తున్న వ్యాఖ్యలే దానికి నిదర్శనమని చెప్పారు.

ఎన్నికల్లో తమ ప్రత్యర్థి డీఎంకేనని అన్నారు. అన్నాడీఎంకే తనను తాను నాశనం చేసుకుంటోందని చెప్పారు. బిగ్ బాస్ షో, సినిమాల ద్వారా వస్తున్న డబ్బును పార్టీ ఫండ్ కు జమ చేస్తున్నానని తెలిపారు. ఎన్నికలలో ఓడిపోయినా తాను బాధపడనని అన్నారు. ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని చెప్పారు.
Kamal Haasan
MNM
AIADMK
DMK
Narendra Modi
Amit Shah
Tamil Nadu
Elections

More Telugu News