Tanish: పోలీసుల నుంచి నాకు నోటీసులు వచ్చిన మాట నిజమే: హీరో తనీశ్

I got notice from Bengaluru police says Tanish

  • తనీశ్ కు నోటీసులు పంపించిన బెంగళూరు పోలీసులు
  • 2017లో ఓ పార్టీకి వెళ్లానన్న తనీశ్
  • అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని వ్యాఖ్య

టాలీవుడ్ లో డ్రగ్స్ భూతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో విచారణ కూడా ఎదుర్కొన్నారు. వారిలో హీరో తనీశ్ కూడా ఉన్నాడు. తాజాగా తనీశ్ కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

బెంగళూరుకు చెందిన ఓ నిర్మాత తన కార్యాలయంలో పార్టీలు ఎక్కువగా ఇస్తున్నట్టు విచారణలో తేలింది. ఆ పార్టీలకు హాజరయ్యే ప్రముఖులలో తనీశ్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.

దీనిపై తనీశ్ స్పందిస్తూ, తనకు నోటీసులు వచ్చిన మాట నిజమేనని చెప్పాడు. డ్రగ్స్ తీసుకున్నాననే కారణంతో నోటీసులు ఇవ్వలేదని, 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారని తెలిపాడు. 2017లో నిర్మాత శంకర్ గౌడ ఇచ్చిన పార్టీకి వెళ్లానని... తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పాడు. అయితే కన్నడ సినిమా వాళ్ల కేసు విచారణలో సాక్షిగా మాత్రమే తనను పిలిచారని తెలిపారు. నోటీసులకు సంబంధించి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నానని చెప్పారు.

Tanish
Tollywood
Police Notice
Bengaluru
  • Loading...

More Telugu News