Chandrababu: ఓ అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్... తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

Chandrababu condemns Nallamilli arrest

  • నల్లమిల్లి బంధువు అనుమానాస్పద మృతి
  • గత కొంతకాలంగా కేసు విచారణ
  • అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లిపై తీవ్ర ఆరోపణలు
  • నల్లమిల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి రెండో భార్య

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన బంధువు సత్తిరాజు రెడ్డి అనుమానాస్పద మృతి వ్యవహారంలో నల్లమిల్లి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సత్తిరాజు రెడ్డి రెండో భార్య నల్లమిల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగా, పోలీసులు నేడు నల్లమిల్లిని అరెస్ట్ చేశారు.

మరోపక్క, నల్లమిల్లి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ టీడీపీ నేతలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలు వెలుగులోకి తెస్తున్నామన్న అక్కసుతోనే వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వికృత రాజకీయాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నల్లమిల్లిపై అక్రమ కేసు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Chandrababu
Nallamilli Ramakrishna Reddy
Arrest
Anaparthy
East Godavari District
TDP
  • Loading...

More Telugu News