Sivaji: ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మకండి: కార్మికులకు సినీ నటుడు శివాజీ పిలుపు

Actor Sivaji supports Vizag Steel Plant workers protests against privatisation

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • కార్మిక సంఘాల నిరసనలు
  • కార్మికులకు సంఘీభావం ప్రకటించిన నటుడు శివాజీ
  • రాజకీయాలకు అతీతంగా అందరూ రావాలని పిలుపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరుకు సినీ నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోందని శివాజీ విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఎలుగెత్తాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మవద్దని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సూచించారు. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని స్పష్టం చేశారు. మా ప్రాంతం కోసం మీరేం చేస్తున్నారంటూ నేతలను ఢిల్లీకి పరుగులు తీయించాలని అన్నారు.

తాను అరెస్ట్ లకు భయపడేవాడిని కాదని శివాజీ స్పష్టం చేశారు. తెలంగాణలోనూ తనపై అన్యాయంగా పలు కేసులు పెట్టారని, అలాంటి కేసులేవీ తనను నిలువరించలేవని పేర్కొన్నారు. తాను తప్పేం చేయలేదు కాబట్టే కోర్టు అండగా నిలిచిందన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News