YSRTP: షర్మిల పార్టీ పేరు ‘వైఎస్సార్ టీపీ’.. జులై 8న ప్రకటన?

YS Sharmila named her party as YSRTP

  • వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ పేరు ప్రకటన
  • ఇప్పటికే ఈసీకి దరఖాస్తు
  • హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
  • వచ్చే నెల 9న రాజకీయ అరంగేట్రంపై స్పష్టత

తెలంగాణలో పార్టీ పెట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల తాను స్థాపించబోయే పార్టీ పేరును కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ‘వైఎస్సార్ టీపీ’ పేరుతో ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు కూడా చేసుకున్నట్టు సమాచారం. ఆమె తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని లోటస్‌పాండ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వైఎస్సార్ సీపీ పేరు తెలంగాణ వ్యాప్తంగా చిరపరిచితమైన నేపథ్యంలో తన పార్టీ పేరును వైఎస్సార్ టీపీగా షర్మిల నిర్ణయించినట్టు చెబుతున్నారు. జులై 8న పార్టీని ప్రకటించనుండగా, వచ్చే నెల 9న ఖమ్మంలో జరిగే సభలో షర్మిల తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఖమ్మం సభ తర్వాత షర్మిల తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తారని, జులై 8న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే, ఈ నెల 16 నాటికి మండల కమిటీల నియమకం పూర్తిచేయాలని పట్టుదలగా ఉన్న షర్మిల ఈ బాధ్యతలను తన ముఖ్య అనుచరుడైన పిట్టా రాంరెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఇందిరా శోభన్‌ తదితరులకు అప్పగించారు.

YSRTP
YS Sharmila
Telangana
YSR
  • Loading...

More Telugu News