Tamannaah: నేను, తమన్నా ఒకే స్కూల్ లో చదువుకున్నాం: పూజా హెగ్డే

Tamannaah and Pooja Hegde are classmates

  • స్కూల్లో తమన్నా నాకు సీనియర్ 
  • ఏ ప్రోగ్రాం జరిగినా డాన్స్ చేసేది
  • తమన్నా చాలా అందంగా ఉంటుంది

టాలీవుడ్ బ్యూటీలు తమన్నా, పూజా హెగ్డే ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ విషయాన్ని పూజ స్వయంగా తెలిపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తెలిపిన పూజ... తన స్కూల్ డేస్ కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది.

తమన్నా, తాను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని... ఆమె తనకు సీనియర్ అని పూజ తెలిపింది. తమన్నా చాలా అందంగా ఉంటుందని కితాబునిచ్చింది. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా ఆమె డాన్స్ చేసేదని తెలిపింది. ప్రతి ఒక్కరితో చక్కగా కలిసిపోయేదని... అందర్నీ ఒకేలా చూసేదని చెప్పింది. ప్రతి ఒక్కరినీ స్నేహితులను చేసుకునేదని... ఆమెలోని కలివిడితనం తనకు ఎంతో నచ్చుతుందని తెలిపింది. సంప్రదాయ దుస్తుల్లో అయినా, పాశ్చాత్య దుస్తుల్లో అయినా ఆమె చాలా అందంగా ఉంటుందని చెప్పింది.

Tamannaah
Pooja Hegde
Tollywood
  • Loading...

More Telugu News