Prabhas: 'రాధే శ్యామ్' నుంచి లవ్లీ పోస్టర్ విడుదల!

New Poster out from Radhe Shyam

  • ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' 
  • శివరాత్రి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల
  • ఇటలీలో జరిగిన అధిక భాగం షూటింగ్  
  • జులై 30న పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'రాధే శ్యామ్'!
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు అందమైన పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. నేడు శివరాత్రి పండుగ సందర్భంగా తాజాగా మరో పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ప్రభాస్, పూజ జంట ప్రేమమైకంలో వున్నట్టుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 'కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది..' అంటూ రాధే శ్యామ్ టీమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఇక ఈ చిత్రంలో అభిమానులు ప్రభాస్ ను సరికొత్త కోణంలో చూస్తారని చెప్పచ్చు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఒక రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. ఇటలీ నేపథ్యంలో ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో జులై 30న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.  

Prabhas
Pooja Hegde
Radha Krishna Kumar
Radhe Shyam
  • Loading...

More Telugu News