Nimmagadda Ramesh: ఇంత ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి: నిమ్మగడ్డ రమేశ్

Municipal elections ends smoothly says Nimmagadda
  • కార్పొరేషన్లలో 57.41 శాతం, మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ జరిగింది
  • ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదు
  • ఎన్నికలు సజావుగా జరగడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు
12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేషన్లలో 57.41 శాతం, మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ జరగడం సంతోషకరమని చెప్పారు.

 ఒక్క చోట కూడా రీపోలింగ్ లేకుండా మున్సిపల్ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారని అన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు జరగడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పోలింగ్ కు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను నివేదికలను ఇవ్వాలని కోరామని తెలిపారు. ఈ నెల 14న కౌంటింగ్ ఉంటుందని చెప్పారు.  
Nimmagadda Ramesh
Municipal Elections
SEC
Andhra Pradesh

More Telugu News