Simran: విక్రమ్ తో మరో సినిమా చేస్తున్న సిమ్రన్!

Simran another film with Vikram

  • రజనీకాంత్ 'పేట్ట'లో నటించిన సిమ్రన్ 
  • కార్తీక్ సుబ్బరాజుతో విక్రమ్ తాజా సినిమా 
  • విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఓ హీరో 
  • విక్రమ్ తో మూడో సినిమా చేస్తున్న సిమ్రన్ 

నిన్నటితరం కథానాయికలలో ఒక ఊపు ఊపిన హీరోయిన్లు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా వుంటున్నారు. తమ వయసుకు తగ్గా పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో సిమ్రన్ కూడా వుంది. ఇకప్పుడు గ్లామర్ అన్న పదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సిమ్రన్ ఇప్పుడు తనకు బాగా నచ్చిన పాత్రలు మాత్రమే ఒప్పుకుంటూ, అప్పుడప్పుడు నటిస్తోంది. ఆమద్యన అలాగే రజనీకాంత్ సరసన 'పేట్ట' సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు విక్రమ్ సరసన ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ 60వ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. పైగా, ఇందులో విక్రమ్ తనయుడు ధృవ్ కూడ నటిస్తున్నాడు.

ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ, "దర్శకుడు సుబ్బరాజుతో పేట్ట తర్వాత మరో సినిమా ఇది. అలాగే విక్రమ్ నటిస్తున్న 60వ సినిమా. డైనమిక్ తండ్రీకొడుకులతో కలసి నటించడం చాలా హ్యాపీగా వుంది" అంటూ ట్వీట్ చేసింది. ఇక విక్రమ్ తో సిమ్రన్ కు ఇది మూడవ సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరూ కలసి 'పితామగన్', ఇటీవల 'ధృవ నచ్ఛత్రం' వంటి తమిళ సినిమాలలో నటించారు.

Simran
Vikram
Kartik Subbaraju
  • Loading...

More Telugu News