Mamata Banerjee: ప్రచారంలో మమత జోరు.. టీ కాచి సర్వ్ చేసిన సీఎం

Mamata Banerjee Makes Tea At Campaign Stop

  • రాష్ట్రంలో 8 విడతలుగా ఎన్నికలు
  • నందిగ్రామ్‌లో టీ చేసిన అందరినీ ఆకర్షించిన సీఎం
  • మమతకు ప్రత్యర్థిగా సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమత దూసుకెళ్తున్నారు. నిన్న తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్‌కి వెళ్లి టీ కాచి అందరికీ అందించారు. ఆ తర్వాత అందరితో కలిసి తాను కూడా టీ తాగారు. మమత టీ కాచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉన్నారు. మమత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది.  బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో 33 రోజులపాటు ఎన్నికలు జరగనున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News