Prashant Neel: సలార్ దర్శకుడితో అల్లు అర్జున్ చర్చలు... తెలుగులో మరో భారీ ప్రాజెక్టు..?

Prashant Neel met Allu Arjun

  • కేజీఎఫ్ తో పాన్ ఇండియా దర్శకుడిగా ప్రశాంత్ నీల్
  • ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్న ప్రశాంత్
  • తాజాగా హైదరాబాదులో బన్నీ కార్యాలయానికి రాక
  • బన్నీకి పవర్ ఫుల్ స్టోరీ వినిపించినట్టు సమాచారం

కేజీఎఫ్ చిత్రాలతో ఆలిండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రం సలార్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో, తాజాగా హైదరాబాదులోని బన్నీ ఆఫీసులో ప్రశాంత్ నీల్ దర్శనమివ్వడంతో మరో భారీ ప్రాజెక్టు కోసమేనని ప్రచారం మొదలైంది. ప్రశాంత్ నీల్... తాజాగా బన్నీకి సూటయ్యే ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును వినిపించడానికే వచ్చాడని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. అయితే సలార్ షూటింగ్ వచ్చే ఏడాది వరకు జరిగే అవకాశం ఉండడంతో ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యేందుకు మరికాస్త సమయం పడుతుందని భావిస్తున్నారు.

Prashant Neel
Allu Arjun
Salaar
Prabhas
KGF
Tollywood
  • Loading...

More Telugu News