Bumrah: ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!

Team India pacer Bumra will ties the knot soon

  • స్పోర్ట్స్ యాంకర్ సంజనాతో బుమ్రా పెళ్లి
  • ఈ నెల 14, 15 తేదీల్లో గోవాలో వివాహం
  • గతంలో బుమ్రాపై అనేక ఊహాగానాలు
  • నటి అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమాయణం అంటూ ప్రచారం
  • ఖండించిన అనుపమ తల్లిదండ్రులు

ఇటీవల ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగిన నేపథ్యంలో అతడి పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ తో బుమ్రా పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని అనుపమ కుటుంబ సభ్యులు ఖండించడంతో అంతటితో తెరపడింది. అయితే బుమ్రా పెళ్లి వార్త మాత్రం నిజమేనని తేలింది.

అమ్మాయి ఎవరో కాదు... స్పోర్ట్స్ యాంకర్ గా పనిచేస్తున్న సంజనా గణేశన్. ఈ అమ్మడు గతంలో బుమ్రాను పలు సందర్భాల్లో ఇంటర్వ్యూ కూడా చేసింది. కానీ వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్న విషయం మాత్రం చాలా గోప్యంగా వుంది. ఇక, వీరి పెళ్లి 14,15 తేదీల్లో గోవాలో జరగనుందట. దీన్నిబట్టి బుమ్రా ఇంగ్లండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు అందుబాటులో ఉండడం కష్టమేననిపిస్తోంది. దీనిపై బుమ్రా నుంచి ఇంకా ప్రకటన రాలేదు.

Bumrah
Sanjana Ganesan
Marriage
Goa
Team India
  • Loading...

More Telugu News