Nara Lokesh: జగరోనా వైరస్ కు ప్రజలే వ్యాక్సిన్ వేయాలి: లోకేశ్

Lokesh comments on YS Jagan and YSRCP leaders

  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
  • ముగిసిన ప్రచారం
  • బందరులో పర్యటించిన లోకేశ్
  • ఏపీని జగరోనా వైరస్ పట్టిపీడిస్తోందని వెల్లడి

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో  స్పందించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బందరులో పర్యటించానని వెల్లడించారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, బందరు వైసీపీ నేతలు టీడీపీని విమర్శించడం తప్ప మరెలాంటి అభివృద్ది చేయలేదని ప్రజలు అంటున్నారని వివరించారు. దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తుంటే, ఏపీని జగరోనా వైరస్ పట్టిపీడిస్తోందని తెలిపారు. ఆ జగరోనా వైరస్ కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే వ్యాక్సిన్ వేయాలని పిలుపునిచ్చానని లోకేశ్ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తే ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తామని భరోసా ఇచ్చానని వివరించారు.

Nara Lokesh
Jagan
YSRCP
Municipal Elections
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News