eWatch App: ఎస్ఈసీ తీసుకువచ్చిన 'ఈ వాచ్' యాప్ నిలిపివేత.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

High Court stops eWatch use in state

  • ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఈ వాచ్ యాప్
  • యాప్ కు అనుమతులు లేవన్న హైకోర్టు
  • టెక్నికల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ఎస్ఈసీ
  • కేసు విచారణ ముగిస్తున్నట్టు వెల్లడి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 'ఈ వాచ్' యాప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే 'ఈ వాచ్' యాప్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 'ఈ వాచ్' యాప్ కు అనుమతులు లేవంటూ యాప్ ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు లేవనెత్తిన టెక్నికల్ ప్రశ్నలకు ఎస్ఈసీ సమాధానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 'ఈ వాచ్' యాప్ పై అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావొచ్చని తెలిపింది.

eWatch App
AP High Court
Local Body Polls
SEC
Andhra Pradesh
  • Loading...

More Telugu News