Adah Sharma: చదరంగం బోర్డుపై ఆదాశర్మ కసరత్తులు... వీడియో ఇదిగో!

Adah Sharma fitness activities on a chess board
  • టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు అందుకుంటున్న ఆదాశర్మ
  • సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్న వైనం
  • వీడియోలతో అలరిస్తున్న నటి
  • మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త వీడియో విడుదల
  • అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో
ఏడేళ్ల కిందట నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ చిత్రంతో ఆదా శర్మ టాలీవుడ్ కు పరిచయం అయింది. అక్కడ్నించి అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి చిత్రాల్లో నటించిన ఈ మోడల్ గాళ్ బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఉత్తరాదికి చెందిన ఆదా శర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన వీడియోలు, ఫిట్ నెస్ వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

తాజాగా ఈ అమ్మడు ఓ భారీ చదరంగం బోర్డుపై పావులతో కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకుంది. చీరకట్టులో వ్యాయామాలు చేస్తూ ఫిట్ నెస్ పై తన అనురక్తిని చాటింది. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Adah Sharma
Chess Board
Fitness
Excercises
Tollywood

More Telugu News