Posani Krishna Murali: జగన్ ఏ విధంగా ఫేక్ ముఖ్యమంత్రి అవుతాడు?: పోసాని

Posani advocates for CM Jagan and ask how will be fake cm

  • పోసాని మీడియా సమావేశం
  • చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు
  • చంద్రబాబే ఫేక్ అంటూ వ్యాఖ్యలు
  • రాజారెడ్డి రాజ్యాంగం అనడం సరికాదన్న పోసాని

సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఇటీవల ఫేక్ ముఖ్యమంత్రి అని సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా మాట్లాడుతున్నారని అన్నారు. పాదయాత్ర చేసిన జగన్ ఇచ్చిన హామీల మేరకు గెలిచిన తర్వాత పథకాలు అమలు చేస్తున్నారని, ఇక ఎలా ఫేక్ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. చంద్రబాబులా మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన సీఎం కాలేదని, మరలాంటప్పడు జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్మీపార్వతిని, సొంత తమ్ముడ్ని, తోడల్లుడ్ని రోడ్డున పడేశారని ఆరోపించారు.

ఇక రాజారెడ్డి రాజ్యాంగం అని, పులివెందుల పంచాయతీలను ప్రచారం చేస్తున్నారని పోసాని తెలిపారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగితే కనీసం ఫిర్యాదు కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. బషీర్ బాగ్ లోనూ కాల్పులు జరిపించారని ఇవన్నీ చంద్రబాబు రాజ్యాంగానికి ఉదాహరణలు అయితే రాజారెడ్డి రాజ్యాంగం అనడం ఏంటో తనకు అర్థంకావడంలేదని పోసాని పేర్కొన్నారు. పులివెందుల పంచాయతీలు అంటున్నారని, ఓసారి పులివెందులలో ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలని హితవు పలికారు.  

షర్మిల అంశంపైనా పోసాని స్పందించారు. షర్మిలకు జగన్ అన్యాయం చేశాడంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. జగన్ ఆమెకు అన్యాయం చేసుంటే ఏపీలోనే పోటీ చేసేవారు కదా అని వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో పార్టీ స్థాపిస్తున్నారని పోసాని వివరణ ఇచ్చారు. పార్టీ పెట్టడం తప్పేమీ కాదని, జగన్ షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు.

  • Loading...

More Telugu News