NASA: అంగారకుడిపై పర్సెవరెన్స్​ జాలీ రైడ్​!

In a first Perseverance test drives on Mars

  • అరుణ గ్రహంపై రోవర్ టెస్ట్ డ్రైవ్
  • 16 అడుగుల దూరం ప్రయాణం
  • ఫొటోను విడుదల చేసిన నాసా
  • ఇప్పటికే ‘ఫస్ట్స్’ పేరిట మరిన్ని చిత్రాలు

దిగ్విజయంగా అంగారకుడిపైన అడుగు పెట్టిన నాసా రోవర్ పర్సెవరెన్స్ పని మొదలు పెట్టేసింది. సరదా ప్రయాణాలు చేసేస్తోంది. అరుణ గ్రహం మీద చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి నాసా ఓ ఫొటో విడుదల చేసింది. పర్సెవరెన్స్ టెస్ట్ డ్రైవ్ మొదలుపెట్టిందని వెల్లడించింది. 16 అడుగుల దూరం వరకు కదిలిందని పేర్కొంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని అడుగులు ముందుకు పడతాయని పేర్కొంది.


కాగా, ఇప్పటికే మార్స్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను పర్సెవరెన్స్ పంపించింది. ‘ఫస్ట్స్’ పేరిట వాటి వివరాలను నాసా వెల్లడించింది. ఫిబ్రవరి 23న విజయవంతంగా పర్సెవరెన్స్ రోవర్ ను నాసా కుజ గ్రహంపై దింపింది. అక్కడి వాతావరణ పరిస్థితులు, గతంలో జీవరాశి మూలాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. ఇప్పటికే గ్రహంపై పరిశోధనలను ప్రారంభించేందుకు రోవర్ ను టెస్ట్ చేసింది.

 

  • Error fetching data: Network response was not ok

More Telugu News