Gilchrist: రిషభ్‌పంత్‌పై గిల్‌క్రిస్ట్ ప్ర‌శంస‌ల జ‌ల్లు!

Gilchrist praises punt

  • ఎన్ని పరుగులు చేశామ‌న్నది మాత్రమే ముఖ్యం కాదు
  • ఆ ప‌రుగుల‌ను ఎప్పుడు చేశామ‌న్నదీ ముఖ్యమే
  • రెండో ఇన్నింగ్స్‌లోనూ సమన్వయంతో ఆడాలి
  • పంత్‌ను గమనిస్తూనే ఉంటానన్న గిల్‌క్రిస్ట్  

టీమిండియా బ్యాట్స్‌మ‌న్ రిషభ్ పంత్ అద్భుతంగా రాణిస్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న ఆట‌తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ గిల్‌క్రిస్ట్ కొనియాడాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇత‌ర ఆట‌గాళ్లు స‌రిగ్గా రాణించ‌లేక‌పోతున్న‌ప్ప‌టికీ  పంత్ 101 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో భారత్ లో ఆయ‌న‌ తొలి టెస్టు శతకం సాధించాడు.

అంతే కాకుండా గిల్‌క్రిస్ట్‌కు సంబంధించిన ఓ రికార్డును కూడా పంత్ చేరుకున్నాడు. భార‌త్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల్లో టెస్టుల్లో సెంచ‌రీలు సాధించిన రెండో కీపర్‌గా పంత్‌ నిలిచాడు. దీంతో అభిమానులు గిల్ క్రిస్ట్ తో పంత్ ను పోల్చుతున్నారు.  దీనిపైనే గిల్ క్రిస్ట్ స్పందిస్తూ... ఎన్ని పరుగులు చేశామ‌న్నది మాత్రమే ముఖ్యం కాద‌ని, ఆ ప‌రుగుల‌ను ఎప్పుడు చేశామ‌న్నదీ ముఖ్యమేన‌ని అన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌ లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ సమన్వయంతో ఆడి జట్టుకు అవసరమైన స‌మ‌యంలో రాణించినప్పుడు నిజమైన మ్యాచ్‌ విన్నర్ అవుతాడ‌ని ఆయ‌న చెప్పాడు. పంత్‌ను తాను గమనిస్తూనే ఉంటాన‌ని గిల్‌క్రిస్ట్ చెప్పాడు.

  • Loading...

More Telugu News