Balakrishna: 'నవ్వకండి... ఇట్స్ సీరియస్ మేటర్'... టీడీపీ నేతలపై బాలయ్య ఆగ్రహం!

BalaKrishna Serious on TDP Leaders Video Viral

  • మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ
  • మాట్లాడుతుంటే నవ్విన టీడీపీ నేతలు
  • సీరియస్ మ్యాటర్ అంటూ హెచ్చరించిన బాలయ్య

హిందూపురానికి జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను మాట్లాడుతున్న వేళ, నవ్విన పార్టీ నేతలపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

 నేటి తరం యువత గురించి మాట్లాడిన బాలకృష్ణ, "రాత్రి అయితే బండ్లేసుకుని ఏదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ... చుక్కలు లెక్కబెడుతూ.. వీళ్లలా పోవడం... ఏదో ఢీ కొట్టడం..." అంటుండగా, పక్కనే ఉన్న హిందూపురం తెలుగుదేశం పార్లమెటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బీకే పార్థసారధి తదితరులు పెద్దగా నవ్వారు.

వెంటనే కాస్తంత అసహనానికి గురైన బాలయ్య, "ఏయ్... నవ్వకండి... ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. నాకు తెలుసు. చాలా మంది అలా తయారవుతున్నారు. సో జాగ్రత్తగా ఉండు..." అని వేలు చూపుతూ హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News