Corona Vaccine: ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ

Online registration to obtain corona vaccine in AP

  • దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్
  • ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేర్ల నమోదు
  • కొవిన్ పోర్టల్లో ఆసుపత్రుల జాబితా లభ్యం
  • పేర్లు నమోదు చేసుకున్నవారికే వ్యాక్సిన్
  • దీర్ఘకాలిక రోగులు డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాలన్న ఆరోగ్యశాఖ

దేశవ్యాప్తంగా మలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ పొందగోరే వారు తమ పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 965 ప్రభుత్వ, 565 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు వివరించింది. ఆసుపత్రుల జాబితా cowin.gov.in వెబ్ సైట్ లో లభ్యమవుతుందని తెలిపింది.

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆన్ లైన్ లోనే పేర్ల నమోదు చేపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముందుగా పేర్లు నమోదు చేసుకోకుండా వెళితే వ్యాక్సిన్ ఇవ్వరని తెలిపింది. 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యులు సంతకం చేసిన నిర్దేశిత సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. 60 ఏళ్లు దాటిన వారు మామూలుగానే పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

Corona Vaccine
Registration
Andhra Pradesh
CoWin
  • Loading...

More Telugu News