Balakrishna: హిందూపురం పర్యటనలో వైసీపీపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌!

bala krishna slams ysrcp

  • వ్య‌వస్థలను నిర్వీర్యం చేసింది
  • నలుగురు మంత్రులతో మాఫియా
  • ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి ప‌నులు చేశారు?
  • ప్రజలు తిరగబడే రోజు వస్తుంది

వైసీపీ ప్రభుత్వ పాల‌న‌పై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిప‌డ్డారు. అనంతపురం జిల్లాలోని త‌న నియోజ‌క వర్గమైన  హిందూపురంలో ఈ రోజు ఉదయం ఆయ‌న మునిసిప‌ల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు వ్య‌వస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
     
ఏపీలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని చెప్పారు. కొంద‌రు వైసీపీ నేత‌లు తనను విమర్శిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు అధికారంలో ఉన్న‌ ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి ప‌నులు చేశారన్న విష‌యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇలాగే ప్ర‌భుత్వం బెదిరింపులకు పాల్పడితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయ‌న హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని విభాగాలను ప్రైవేటు పరం చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. 

Balakrishna
Telugudesam
Anantapur District
  • Loading...

More Telugu News