Asaduddin Owaisi: మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే... వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటే ఇంకా మంచిది: అసదుద్దీన్ ఒవైసీ

Owaisi comments after Modi took corona vaccine

  • ఇవాళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ
  • పేద, మధ్య తరగతి ప్రజలకూ అందుబాటులోకి తేవాలన్న ఒవైసీ
  • తక్కువధరలో వ్యాక్సిన్ అందించేలా చూడాలని విజ్ఞప్తి
  • పాత్రికేయులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని వినతి
  • 64 ఏళ్లకు పైబడిన వారికి కరోనా టీకా అంశంలో స్పష్టత ఇవ్వాలన్న ఒవైసీ

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం బాగుందని, అయితే వ్యాక్సిన్ ను అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకువస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా కరోనా వ్యాక్సిన్ పొందేందుకు వీలుగా వ్యాక్సిన్ కు తక్కువ ధర నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. కరోనా వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరూ వేయించుకుని తమను తాము కాపాడుకోవాలని ఒవైసీ సూచించారు.

అయితే, కరోనా టీకాపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. 64 ఏళ్లకు పైబడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా అనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, కరోనా వ్యాప్తి సమయంలో ముందు నిలిచి కృషి చేసిన వారిలో పాత్రికేయులు కూడా ఉన్నారని, అందుకే ప్రతి ఒక్క పాత్రికేయుడికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News