Kunta Srinu: సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం కుంట శ్రీను, చిరంజీవిలను సుందిళ్ల బ్యారేజి వద్దకు తీసుకెళ్లిన పోలీసులు!

Police brought Kunta Srinu and Chiranjeevi to Sundilla Barrage for scene reconstruction

  • ఇటీవల పెద్దపల్లి జిల్లాలో వామనరావు దంపతుల హత్య
  • కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి
  • హత్య తర్వాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజిలో పడేసిన నిందితులు
  • భారీ బందోబస్తుతో నిందితులను సుందిళ్ల తీసుకొచ్చిన పోలీసులు

ఇటీవల పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల దారుణ హత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటనలో కుంట శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపిన తర్వాత నిందితులు కుంట శ్రీను, చిరంజీవి తమ ఆయుధాలను సుందిళ్ల బ్యారేజిలో పడవేసినట్టు వెల్లడైంది.

దాంతో, పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం కుంట శ్రీను, చిరంజీవిలను ఈ మధ్యాహ్నం సుందిళ్ల బ్యారేజి వద్దకు తీసుకువచ్చారు. కత్తులను, వేట కొడవళ్లను ఎక్కడ విసిరేశారంటూ వారిని విచారించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నడుమ నిందితులిద్దరినీ తీసుకువచ్చారు. ఇద్దరికీ కలిపి బేడీలు వేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News