Life Imprisonment: ఈ రాష్ట్రంలో ఆహార కల్తీకి పాల్పడితే జీవితమంతా జైలే గతి!

Life imprisonment for food adulteration in Madhya Pradesh

  • మధ్యప్రదేశ్ లో కఠినచట్టం
  • ఆహార కల్తీకి పాల్పడితే జీవితఖైదు
  • చట్టానికి సవరణలు
  • ఆమోదించిన మధ్యప్రదేశ్ కేబినెట్

ఆహార కల్తీ వల్ల తీవ్ర దుష్పరిణామాలు కలగడమే కాదు, అవి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీస్తాయి. అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆహార కల్తీకి పాల్పడే వారు ఇకపై జీవితాంతం జైల్లో ఉండేలా చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. దైనందిన ఆహారాన్ని కల్తీ చేస్తూ దాన్ని ఓ వ్యాపారంగా మలచుకుని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వారికి జీవితఖైదు విధించేలా ఈ మేరకు కఠినమైన చట్టానికి రూపకల్పన చేసింది. గతంలో ఆహార కల్తీ దోషులకు 6 నెలల జైలు శిక్ష విధించేవారు. కాలక్రమంలో దాన్ని 3 సంవత్సరాలకు పొడిగించారు. ఇప్పుడది జీవితఖైదు అయింది.

దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.... గతంలో ఉన్న చట్టానికి తాజాగా చేసిన సవరణలకు మంత్రివర్గ ఆమోదం లభించిందని వెల్లడించారు. కల్తీ చేసిన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించడం కంటే పెద్ద నేరం ఇంకేదీ ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ చట్టానికి సవరణలు చేసిన విషయాన్ని గవర్నర్ ఆనంది బెన్ పటేల్ అసెంబ్లీకి తెలిపారు.

  • Loading...

More Telugu News