Jagan: శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
- మార్చి 11న శివరాత్రి
- బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం
- సీఎంను కలిసిన వెల్లంపల్లి, శ్రీశైలం ఈవో
- సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందజేత
- పవిత్ర పట్టు వస్త్రాల బహూకరణ
మార్చి 11న మహాశివరాత్రి పర్వదినం అన్న సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలం శివరాత్రి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. పవిత్ర వస్త్రాలను కూడా సీఎం జగన్ కు బహూకరించారు. శ్రీశైలం ఆలయ వేదపండితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి.