EO Suresh Kumar: బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో సురేశ్ బదిలీ

Vijayawada Durga Temple EO transferred
  • దుర్గ గుడిలో అక్రమాలు అంటూ ఆరోపణలు గుప్పించిన విపక్షాలు
  • ఇటీవల ఏసీబీ సోదాలు
  • ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ
  • ఇప్పటివరకు 15 మంది సిబ్బందిపై వేటు
ఇటీవల విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఏసీబీ సోదాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. పలువురు అధికారులను సస్పెండ్ చేయడంతో ఆలయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈ క్రమంలో దుర్గ గుడి ఈవో సురేశ్ బాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవో సురేశ్ బాబు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడంటూ విపక్షాలు ఎలుగెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.

అమ్మవారి ఆలయంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం 15 మంది సిబ్బందిపై వేటు వేసింది. వారిలో ఐదుగురు సూపరింటిండెంట్ స్థాయి అధికారులు ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి సురేశ్ ను బదిలీ చేసిన సర్కారు, త్వరలోనే ఆయనపైనా సస్పెన్షన్ వేటు వేసే అవకాశముందని తెలుస్తోంది.
EO Suresh Kumar
Durga Temple
Vijayawada
ACB
Andhra Pradesh

More Telugu News